వైసీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించిన అధికార తెలుగుదేశం ఆశలపై ట్రిబ్యునల్ నీళ్లు చల్లింది. తక్షణమే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ కారణాలతో వీఆర్ఎస్ను నిలిపివేయడం సరికాదని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. దీంతో ఆయన నామినేషన్ లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలో ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం లభించింది. బీసీలకు పెద్దపీట వేసేందుకు వైసీపీ ఏడు లోక్‌సభ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు అధికారిగా పనిచేసిన గోరంట్ల మాధవ్ ను ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. రాజకీయాల్లో చేరే క్రమంలో రెండు నెలల క్రితమే ఆయన వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది. దీంతో ఆయన నామినేషన్‌పై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టు తక్షణమే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీడీపీ నుంచి నుండి సిట్టింగ్ ఎంపీగా ఉన్న నిమ్మల కిష్టప్పకి మరోసారి అవకాశం ఇచ్చారు. హిందూపురం అసెంబ్లీ నుండి మళ్ళీ బాలకృష్ణ, పెనుగొండ నుండి పార్ధసారధి, మడకశిర నుండి వీరన్న, రాప్తాడు నుండి పరిటాల శ్రీరామ్ లకు టికెట్లు ఇచ్చారు. అయితే ఈసారి అనంతలో వైసీపీ ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. మడకశిరనుంచి వీరన్న, రాప్తాడునుంచి పరిటాల ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత మార్పు రాజకీయాలు ప్రారంభించి పార్టీ అభ్యర్ధిగా మాధవ్ ను నియమించడం పట్ల వైసీపీ ఈ స్థానం గెలుచుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
