ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తేది దగ్గరవుతున్న తరుణంలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ తరుపున వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రచారం నిర్వహించనున్నారు. విజయమ్మ, షర్మిల కోసం వేర్వేరు ప్రచార రథాలను వైసీపీ సిద్ధం చేస్తోంది. 27న మంగళగిరి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్న షర్మిల ఉత్తరాంధ్ర ఇచ్చాపురం వరకు కొనసాగనుంది. మొత్తం 10 జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్న షర్మిల దాదాపు 50 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. అలాగే వైఎస్ విజయమ్మ 40 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. మొత్తానికి ఎన్నికల్లో వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఇటు షర్మిల, అటు వైయస్ విజయమ్మ ఎన్నికల ప్రచార రణరంగంలోకి దిగుతున్నారు. వైఎస్ విజయమ్మ, షర్మిలను ప్రచారానికి దించితే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని వైయస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే మొదటగా మంగళగిరిలో నుంచి ప్రారంభం అవుతుడండంతో నారా లోకేష్ ఇక గెలుపు అసాద్యం అంటున్నారు సినీయర్ రాజకీయ నాయకులు
