వంగవీటి రాధా గత కొన్ని రోజులక్రితమే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై పలు సంచలన ఆరోపణలు చేసి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పెడన అసెంబ్లీ లేదా మచిలీపట్నం ఎంపీ టిక్కెట్ ఆశించన వంగవీటి రాధాకు చంద్రబాబు షాకిచ్చారు.నిన్న రాత్రి చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల తుది జాబితాలో రాధా పేరు లేదు. దీంతో రాధా అభిమానులు, కార్యకర్తలు తీవ్ర షాక్‌కు గురయ్యారు.అదే రాధా..వైసీపీలో ఉంటే ఎమ్మెల్సీ కానీ పార్టీలో ఒక ఉన్నత పదవి జగన్ ఇచ్చేవారాని..తొందరపడి తెలుగుదేశం పార్టీలో చేరి పెద్ద తప్పు చేశారని తన అనుచరులు తీవ్రంగా భాధపడుతున్నారు.
2014ఎన్నికలలో తెలుగుదేశం గెలిచిన వెంటనే వైసీపీ పార్టీ ,ఫ్యాన్ గుర్తుపై గెలిచిన కర్నూల్ జిల్లా నేతలు ఎస్పీ వై రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి,బుట్టా రేణుకాకి ఈ ఎన్నికల్లో హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు..నిన్నకాక మొన్న చేరిన నీకు చంద్రబాబు ఎలా న్యాయం చేస్తాడని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.అలాగే ఈ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తమ వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు ఆడే ఒక కొత్త డ్రామా అని తెలుసుకో అంటూ పలువురు ఆరోపిస్తున్నారు.