ఏపీలో అధికార తెలుగుదేశం,ప్రతిపక్ష వైసీపీ పార్టీల ప్రచారం హోరెత్తింది. మరికొన్ని రోజులే గడువు ఉండటంతో ఎలాగైగా మరోసారి గెలువాలని తెలుగుదేశం పార్టీ కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు దారితీస్తుంది.ఇప్పటికే రాష్ట్రంలోని వైసీపీ కార్యకర్తల ఓట్లు తొలగింపు,కార్యకర్తలపై దాడి,అక్రమ కేసులు,వైఎస్ వివేకానంద రెడ్డి హత్యా ,మరియు జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం..ఇలా ప్రతిపక్ష పార్టీ అధినేతపై,కార్యకర్తలపై తెలుగుదేశం దాడి చేస్తిస్తున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నేతలు తమ హద్దుమీరుతున్నారు. రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురయ్యేలా బరితెగింపు వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇవాళ ప్రకాశం జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును గెలిపించేందుకు పోరాడుదాం.. అవసరమైతే రౌడీయిజం చేద్దామని వ్యాఖ్యానించారు. అందులో తప్పేం లేదని కూడా అన్నారు.అయితే శివరామ్ చేసిన మాటలపట్ల రాష్ట్ర ప్రజలు ఇలాంటి నాయకులను ఎన్నుకుంటే సామాన్య ప్రజలకు రక్షణ ఉండదని అబ్యాంతరం వ్యక్తం చేస్తున్నారు.