అధికార తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలయ్యింది. టీడీపీ తరఫున పోటీ చేయలేమంటూ ఆ పార్టీ నేతలు చేతులెత్తేస్తున్నారు. టికెట్ ఇస్తామన్నా.. వద్దంటూ ఒక్క రొక్కరిగా పారిపోతున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బనగానపల్లె టీడీపీ అభ్యర్థి BC జనార్దన్ రెడ్డి టికెట్ వచ్చిన తరువాత కూడా ప్రచారానికి దూరం ఉన్నట్లు తెలుస్తుంది. మొన్న ఆదాల,నిన్న బుడ్డా,ఈరోజు బీసీ ముగ్గురు అధికార పార్టీ అభ్యర్థులు టికెట్ ఇచ్చినా కూడా పోటీకి సుముఖంగా లేరు,ఖచ్చితంగా ఓడిపోతామని వీళ్లు పోటి నుంచి తప్పకున్నట్లు సమచారం. ఓటమి ఖాయమని తెలుస్తున్నందున.. ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు చేసి.. ఉన్న డబ్బులను కూడా ఎందుకు పోగొట్టుకోవడమని భావిస్తున్నట్టు తెలిసింది. అయితే చంద్రబాబుకు ఇంత ప్రజా వ్యతిరేకత గతంలో ఎన్నడూ లేదు. ఈసారి ఖచ్చితంగా వైసీపీ గెలవడం ఖాయం అయినట్లే.
