సార్వత్రిక ఎన్నికల ముందు కర్నూల్ జిల్లాలో అధికార టీడీపీ పార్టీ భారీ షాక్ తగిలింది. ప్రతి పక్ష పార్టీ వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబానికి దశబ్దాల కాలంగా అండగా ఉన్న కుటుంబాలతో పాటు వారి దగ్గరి బంధువులు సైతం టీడీపీ వీడుతున్నారు. గత వారం రోజుల నుంచి వరుసగా ఆపార్టీ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకుంటుండటంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.తాజాగా ఫిరాయింప్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీ కి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుక కూడా తిరిగి వైసీపీలోకి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ఎస్వీ మోహాన్ రెడ్డి కూడ వైసీపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. కర్నూల్ జిల్లా టిక్కెట్ టీజీ భరత్ కు చంద్రబాబు ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఇక ఎస్వీ మోహాన్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు సమాచారం. ఖచ్చితంగా ఈ రోజు లేదా రేప్ రాజీనామా చేయ్యడం మాత్రం పక్కా అంటున్నారు వైసీపీ అభిమానులు. ఎందుకంటే ఎస్పీ వై రెడ్డి, బుట్టా రేణుక టీడీపీని వీడారు. కనుక ఇక ఎస్వీ మోహాన్ రెడ్డి కూడ మారడం ఖాయం అంటున్నారు.
