అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ నిన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉండి చంద్రబాబును ఏకిపారేసిన విషయం అందరికి తెలిసిందే,అయితే ఆయన టీడీపీలో చేరారు.ఎంపీ టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో పచ్చపార్టీలో చేరిన హర్షకుమార్కు బాబుగారు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు షాకిచ్చారు. హర్షకుమార్ కు ఎటువంటి టికెట్ ఇవ్వకపోగా ఆ అమలాపురం టికెట్‌ను గంటి హరీష్‌కు కేటాయించారు.దీంతో ఆయయనకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టే అయింది. ఇక మొన్న టీడీపీలో చేరే సందర్భంలో హర్షకుమార్ చంద్రబాబు కాళ్లపై పడ్డారు.దీనిపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
పార్టీలో చేరి చంద్రబాబు కాళ్ళు పట్టుకున్న హర్షకుమార్ కి టికెట్ ఇవ్వకుండా,పార్టీలో చేరకుండానే భీమిలి టికెట్ చంద్రబాబు సబ్బం హరికి ఇచ్చారు.అయితే సబ్బం హరి మాత్రం నాకొద్దు పోటీ అంటున్నారని సమాచారం.ఇతనే కాకుండా మరికొందరు టికెట్ ఇచ్చిన అభ్యర్ధులు కూడా పోటీ చెయ్యమని చెబుతున్నారు.