సీనియర్ నాయకుడు అయినప్పటికీ, అడ్డగోలుగా మాట్లాడుతూ, అహంభావాన్ని ప్రదర్శిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగిలింది. స్థాయిని దిగజార్చుకొన్న రీతిలో మాట్లాడుతున్న ఆయనకు…ఆయన స్థాయిని గుర్తు చేస్తూ కౌంటర్ ఇచ్చారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒంగోలులో నిర్వహించిన బహిరంగసభలో, పార్టీ నేతల టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీజేపీ.. ఈ మూడు పార్టీలు ఒక్కటే అన్నారు. ఫ్యాన్ ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే.. హైదరాబాద్‌లో స్విచ్.. ఢిల్లీలో కరెంట్ ఉందంటూ సెటైర్లు వేశారు. ఇక డబ్బు ఇచ్చే వాళ్లకే వైసీపీ సీట్లు ఇస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు.. తెలంగాణ ప్రభుత్వం వైఎస్ జగన్‌కి డబ్బులు ఇస్తుంది… నాకు ఇచ్చే వాళ్లు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా బీహార్ దొంగ ప్రశాంత్ కిశోర్ ఏపీలో ఓట్ల దొంగతనం చేశారని మండిపడ్డారు.
ఈ కామెంట్లపై ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. తాజాగా ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. “ఓటమి స్పష్టమైన నేపథ్యంలో సంయమనం కోల్పోయి, అసహనంతో మాట్లాడకండి చంద్రబాబు నాయుడుగారు. దీని బదులుగా రెండో సారి మీకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలో ఆలోచించుకోండి. బీహారీలు దొంగలు అనే దిగజారుడు మాటలు ఆపండి“ అంటూ హితవు పలికారు.
Post Views: 365