ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితాను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒకే విడతలో ప్రకటించారు. ఇందులో 41 మంది బీసీలకు కేటాయించినట్లు జగన్ వెల్లడించారు. జిల్లాల వారిగా ఉన్నత విద్యావంతులు, డాక్టర్లు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్ లాంటి సర్వీసుల్లో పనిచేసిన వారినే కాకుండా, గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని కూడా అభ్యర్ధులుగా ఎంపిక చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, పలు దఫాలుగా కోర్ కమిటీతో చర్చలు జరిపి అభ్యర్ధుల ఎంపికలో తనదైన ప్రత్యేకత ఉండేలా, ప్రజల్లో విశ్వసనీయత, నమ్మకం పెరిగే విధంగా తన టీం ను ఎంపిక చేసుకున్నారు.
మరోవైపు సామాజిక సమతుల్యతను పాటిస్తూ బీసీలు, మైనార్టీలు ఇతర వర్గాలకు మంచి ప్రాధాన్యత కల్పించారు. ఇందులో కొత్తవారైన యువ ఎస్సీలకు సైతం ప్రాధాన్యత కల్పించారు. సామాన్య దళిత యువకుడికి ఎంపీ టికెట్ ఇచ్చి పార్టీలో మహామహులందరినీ పక్కనపెట్టి అభ్యర్ధులని ప్రకటించే అరుదైన అవకాశం ఇచ్చిన నాయకత్వం జగన్ వైపు కనిపిస్తుంటే.. ఎన్నోసార్లు ఎంపీగా పనిచేసినా ఇప్పుడు టికెట్ ఇవ్వటానికి కాళ్ళు పట్టించుకొనే నాయకత్వం చంద్రబాబు వైపు కనిపిస్తుంది. తమ స్వార్ధం కోసం జాతిని తాకట్టు పెట్టే నయవంచకులు ఎస్సీ సామాజికవర్గంలో ఉన్నారనటానికి ఇదే ఉదాహరణ.. దళితులలో ఆత్మవిశ్వాసంతో పోరాడే కొత్త నాయకత్వాన్ని కోరుకోవాలే తప్ప తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేవారిని కాదు..