తాజాగా ఎన్నికలు సమీపించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సభకు జనాదరణ కరువవుతోంది. ఎక్కడ సభ పెట్టినా సొంత డబ్బా కొట్టుకోవడంతో పాటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, ప్రధాని మోదీని విమర్శించడానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రసంగంలో పదేపదే పార్టీ కార్యకర్తలకు పాదాభివందనమంటూ ప్రాధేయపడుతున్నారు. సీఎం సభలకు జనం పెద్దగా రాకపోవడంతో వెలవెలతున్నాయి. కుర్చీలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే కష్టం, వైఎస్సార్ సీపీ రూలింగ్‌లోకి వస్తే తాము మాట్లాడలేమని, అందుకే ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని చంద్రబాబు పేర్కొంటున్నారే తప్ప ఈ ఐదేళ్లుగా ప్రజలకు ఏం చేసారో చెప్పుకోలేకపోతున్నారు.
గతంలో తాను ప్రజలకు అన్ని పనులు చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మీద కేసీఆర్ కక్షగట్టారని పసలేని ప్రసంగాలతోపాటు గుజరాత్ కంటే ఏపీ అభివృద్థి చేసి తాను దేశంలో మించిపోతానన్న భయం మోడిని వెంటాడుతుందంటున్నారు. మరోవైపు జగన్ మాత్రం కచ్చితంగా అధికారంలోకి వస్తే నవరత్నాల ద్వారా ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తామో చెప్తూనే ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలను ఏ విధంగా వంచిస్తున్నారో చెప్తున్నారు.