వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తమ పార్టీ తరఫున బరిలో దిగబోయే అసెంబ్లీ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. వైసీపీ అధికారం కైవసం చేసుకోవడం తథ్యమని ప్రచారం జరుగుతున్న తరుణంలో గతానికి భిన్నంగా మొత్తం 175 మంది జాబితాను అధినేత జగన్ ఒకేసారి విడుదల చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో జగన్ తీసుకున్న నిర్ణయం పలువురిని ఆకట్టుకుంది.
9 మంది ఆలిండియా సర్వీసుల్లో పనిచేసిన వారుండగా…డాక్టర్లు 15 మంది ఉన్నారు. పోస్ట్‌గ్రాడ్యుయేట్లు 41 మంది, గ్యాడ్యుయేట్లు 98 ఉన్నారు. మొత్తమ్మీద డిగ్రీ, ఆపైబడి చదివిన వారు 139 మంది ఉన్నారు. 75 మంది అభ్యర్థుల్లో 45 ఏళ్లలోపు వారు 33 మంది. 45 నుంచి 60 ఏళ్లలోపు వారు 98 మంది. 60 ఏళ్లకు పైబడ్డ వారు కేవలం 44 మంది. ఇక…సిట్టింగ్ ఎమ్మెల్యేలు 40 మందికి టికెట్లు రాగా.. గతంలో మంత్రులుగా పనిచేసినవారు 12 మందికి అవకాశం వచ్చింది. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా పోటీచేసిన వారు 145 మందికి వైసీపీ జాబితాలో స్థానం దక్కింది. ఇక.. ఈ జాబితాలో మాజీ ఎంపీలు ఇద్దరు, మాజీ ఎమ్మెల్యేలు 37 మంది, మాజీ ఎమ్మెల్సీ ఒకరు, ఎంపీలుగా పోటీ చేసిన వారు ముగ్గురు, ఎమ్మెల్యేలుగా పోటీచేసిన వారు 21 మంది ఉన్నారు.
Tags announcement ap assembly seats elections jagan ysrcp