ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది.ఈ రోజు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ నేత ,బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేశ్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే అంతకుముందు నిన్న శనివారం రాత్రి పార్టీ తరఫున పోటీ చేసే తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 16మంది అభ్యర్థుల జాబితాను నందిగం సురేశ్ ఈ రోజు ఉదయం జగన్ సమక్షంలో విడుదల చేశారు. మొత్తం 25మంది అభ్యర్థుల జాబితాను ఆయన చదివి వినిపించారు.
వైఎస్సార్‌సీపీ పార్లమెంటు అభ్యర్థులు వీరే
వైఎస్సార్ కడప – వైఎస్ అవినాష్‌రెడ్డి
నెల్లూరు – ఆదాల ప్రభాకర్‌రెడ్డి
తిరుపతి – పల్లె దుర్గాప్రసాద్
రాజంపేట – పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
చిత్తూరు – నల్లకొండగారి రెడ్డప్ప
నంద్యాల – పీ బ్రహ్మానందరెడ్డి
కర్నూలు – డాక్టర్ సింగరి సంజీవ్‌కుమార్
అనంతపురం – తలారి రంగయ్య
హిందుపురం – గోరంట్ల మాధవ్
విజయవాడ – పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)
గుంటూరు – మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి
నరసారావుపేట – లావు కృష్ణదేవరాయలు
బాపట్ల – నందిగం సురేశ్
ఒంగోలు – మాగుంట శ్రీనివాస్‌రెడ్డి
శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాసరావు
విజయనగరం – బెల్లాని చంద్రశేఖర్
అరకు – గొడ్డేటి మాధవి
విశాఖపట్నం – ఎంవీవీ సత్యనారాయణ
అనకాపల్లి – డాక్టర్ సత్యవతి
కాకినాడ – వంగా గీత
అమలాపురం – చింతా అనురాధ
రాజమండ్రి – మర్గాని భరత్
నరసాపురం – రఘురామ కృష్ణంరాజు
ఏలూరు – కోటగిరి శ్రీధర్
మచిలీపట్నం – బాలశౌరి
పేర్లను జగన్ ఖరారు చేశారు.