టీఆర్ఎస్ పార్టీ యువనేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీలో హోరాహోరీగా సాగుతున్న పోరు గురించి ఆసక్తికర విశ్లేషణ చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో ఏం జరగనుందో చెప్పారు. చంద్రబాబు ఓటమి ఖాయమనే రీతిలో పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ పేర్కొంటూ ఇందుకు తగు కరాణాలను ఆయన వెల్లడించారు. “చంద్రబాబు ఐదేండ్లు సీఎంగా పనిచేశాక తాను చేసింది ఏమిటో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను ఫలానా పనిచేసిన.. నాకు ఓటు వేయండి అని అధికార పార్టీగా అడగాలి. ఇంకా గెలిపిస్తే ఫలానా పనిచేస్తాం అని చెప్పగలగాలి. తెలంగాణలో టీఆర్‌ఎస్ అదే పనిచేసింది. మేం ఏం పనిచేశామో చెప్పాం..మళ్లీ గెలిపిస్తే ఈ పనులు చేస్తామని ఓటు అడిగాం. చంద్రబాబు నెగెటివ్ ధోరణితో బట్టకాల్చి మీద వేసి, మసిపూసి మారేడుకాయ చేసి ఓట్లు పొందాలని నెగెటివ్ పాలిటిక్స్ చేస్తున్నారు“ అని వివరించారు.
ఆంధ్ర ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే.. ఆంధ్ర ప్రజలు బాగుండాలి.. తెలంగాణ ప్రజలు బాగుండాలనేది మా విధానం అని కేటీఆర్ స్పష్టం చేశారు. “గత ఐదేండ్లలో ఏపీ ప్రయోజనాల విషయంలో ఏనాడూ వారికి ఆటంకం కల్పించలేదు. భవిష్యత్తులో కూడా ఎలాంటి కార్యక్రమం చేయబోం. ఏపీ ప్రయోజనాలపై వ్యతిరేక భావం లేదు. తెలంగాణలో చంద్రబాబు ఇక్కడి సీమాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూసినా చైతన్యవంతమైన సీమాంధ్ర ప్రజలు తిరస్కరించారు. ఏపీ ప్రజలు కూడా నెగెటివ్ పాలిటిక్స్‌ను తిప్పికొడుతారని నమ్ముతున్నా. తమకు ఏ నాయకత్వం అయితే మేలు జరుగుతుంది, ఎవరి వల్ల ఏపీ ముందుకు పోతుంది అనేది ఆంధ్ర ప్రజలు ఆలోచించుకోవాలి. టీఆర్‌ఎస్‌కు ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెట్టాల్సిన అవసరం, పరిస్థితి లేదు.“ అని వెల్లడించారు.
Tags ap Chandrababu elections jagan ktr loosing tdp trs ysrcp