కేవలం తెలంగాణ ప్రభుత్వం గురించి విమర్శలే లక్ష్యంగా పరిపాలనను గాలికి వదిలేసిన ఏపీ సీఎం చంద్రబాబు గురించి ఆ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏపీలోని మంత్రులు, ఇతర టీడీపీ ముఖ్యులు బాబు తీరును ఎలా భావిస్తున్నారు? ఈ విషయంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరంగల్ అర్బన్ హన్మకొండ ప్రెస్‌క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ…ఏపీ ప్రజలు చంద్రబాబు తీరును చూసి విసుక్కుంటున్నారని అన్నారు.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ.. కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తే ప్రజలు ఎలా సహిస్తారని దయాకర్‌రావు సూటిగా ప్రశ్నించారు. “చంద్రబాబు గ్రూపు రాజకీయలను ప్రోత్సహిస్తారు. ఆంధ్ర మంత్రుల నుంచి ఇప్పటికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి సీఎం చంద్రబాబు తప్పు చేశారని వారు అంటున్నారు. కాంగ్రెస్‌తో కలవడం టీడీపీ మంత్రులకు కూడా ఇష్టం లేదు“ అని ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, తాను టీడీపీలో ఉన్నప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ నుండి పోటీచేసి ఓడిపోయి టీడీపీలోకి వచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. “మేం ఉన్న టీడీపీ పార్టీలోకి చంద్రబాబు వచ్చారు. కేసీఆర్, నేను టీడీపీలో ఉన్నప్పుడు.. కాంగ్రెస్ నుండి పోటీచేసి ఓడిపోయిన చంద్రబాబు టీడీపీలోకి వచ్చారు. అప్పుడు వ్యతిరేకించిన వాళ్లలో నేను కూడా ఉన్నా“ అని ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. చంద్రబాబు కాలాంతకుడని ఎన్టీఆర్ కు అప్పుడే చెప్పామని వివరించారు.
Post Views: 280