కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో ముఖ్యనేత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సి సెల్ చైర్మన్ ఆరెపల్లి మోహన్ ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మోహన్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మోహన్ వెంట వచ్చిన పలువురు సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ‘ఆరేపల్లి మోహన్ లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లోకి రావడం ద్వారా మానకొండూరు నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతమవుతుంది. టీఆర్‌ఎస్ మరియు ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలోకి చేరుతున్న మోహన్ లాంటి నాయకులందరికీ పార్టీ సముచిత గౌరవం ఇస్తుందని’ కేటీఆర్ తెలిపారు.
Tags congress joining ktr leaders telangana trs