ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలను అంతం చెయ్యాలని కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ… వైఎస్ వివేకానందరెడ్డి హత్య చాలా దారుణమని,దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అన్నారు.ఇప్పుడిప్పుడే నిజాలు బయటకు వస్తున్నాయని అన్నారు. వైఎస్ కుటుంబంపై కక్షా రాజకీయాలు చేస్తున్నారని ఆనం మండిపడ్డారు. రాజకీయంగా వాళ్ళని ఎదుర్కునే ధైర్యం లేక అధికారం కోల్పోతున్నామని భయంతో ప్రతిపక్షాలను అంతమొందించే కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు.వివేకా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని,రాష్ట్ర ప్రభుత్వం పై మాకు నమ్మకం లేదని చెప్పుకొచ్చారు.మన రాష్ట్రంలో విపక్ష నేతలకు రక్షణ కూడా లేని పరిస్థితి ఏర్పడిందన్నారు.