మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలు మారే నాయకులు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కాకినాడకు చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీ అభ్యర్థులు కూడా పార్టీలు మారడం ఆసక్తికరంగా మారింది. ఇంతకాలం కాకినాడ నుంచి టీడీపీ ఎంపీగా వ్యవహరిస్తున్న తోట నరసింహం వైసీపీలో చేరారు. అయితే ఇంతకాలం వైసీపీలో ఉన్న చలమలశెట్టి సునీల్ తాజాగా టీడీపీలో చేరారు. 2009లో ప్రజారాజ్యం తరపున కాకినాడ ఎంపీగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్, 2014లో వైసీపీ తరపున కాకినాడ ఎంపీ రేసులో నిలిచారు. ఈ రెండు పర్యాయాలు ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మూడోసారి కాకినాడ ఎంపీగా పోటీ చేసి తన అదృష్ణాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న సునీల్ తోట నరసింహం పార్టీ మారే అవకాశం ఉండటంతో టీడీపీలో చేరారు అయితే ఈ టికెట్ ను వైసీపీ ఇంకా ఎవరికీ కేటాయించలేదు.
దీంతో తోట నరసింహం వైసీపీలో చేరినా సునీల్ కూడా తిరిగి టీడీపీ నుంచి వైసీపీలోకి రావాలని బావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తోట నరసింహం కూడా కాకినాడ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపించకపోవడం వల్లే చలమలశెట్టి సునీల్ వైసీపీలో చేరుతున్నాని కొందరు వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి చలమలశెట్టి వైసీపీలోకి రీఎంట్రీ, మరోవైపు బలమైన సామాజికవర్గారనికి చెందిన తోట నరసింహం ఇప్పటికే వైసీపీలో చేరడంతో కాకినాడ పార్లమెంట్ సీటు వైసీప తన ఖాతాలో వేసుకున్నట్టవుతోంది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో సునీల్ టీడీపీకి అత్యంత బలమైన ప్రత్యర్ధి అవనున్నాడని అర్ధమవుతోంది.