ఈ తెల్లవారుజామున వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇది హత్యేనని పోస్ట్మార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్లు సమాచారం.వివేకానందరెడ్డి శరీరంపై ఏకంగా ఏడు కత్తి గాయాలు ఉన్నాయని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. పదునైన ఆయుధంతో ఆయన శరీరంపై దాడి చేసినట్లు తెలుస్తోంది.పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే పోలీసులు, అధికారులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాలి.
