దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రాజశేఖరరెడ్డి తమ్ముడు,మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(68) మరణించారు. ఈ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. వివేకానందరెడ్డి అంటే ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అని అందరికి తెలుసు.తన వద్దకు సాయం కోసం వచ్చిన ఎవరికోసమైన ఎంతవరకైనా వెళ్తారు. రాజకీయాల్లో వైఎస్సార్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తూ తోడుగా ఉండేవారు.
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఏంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఆయన పనిచేసారు. వైఎస్ వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించారు.చదువు విషయంలో కూడా ఆయన ఎప్పుడూ ముందే. తిరుపతి ఎస్వీ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు.పులివెందుల నుంచి 1989,1994లలో వైఎస్ వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2004 లలో కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా విజయం సాదించారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు.అంతేకాకుండా వ్యయసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.అయితే ఇలాంటి సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం కడప జిల్లాతో పాటు, వైఎస్సార్ కుటుంబ మరియు అభిమానుల్లో విషాదం నింపింది.