వైయస్ జగన్ తన బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి మరణవార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరి కొద్ది సేపటి క్రితమే చేరుకున్నారు.తండ్రి తరువాత తండ్రి లాంటి బాబాయ్ మరణంతో తీవ్రంగా కలత చెందిన ఆయన అభ్యర్థుల ఎంపిక కసరత్తును పక్కనపెట్టి పులివెందులకు వచ్చారు.ఆయన పార్థీవ దేహాన్ని చూసి చలించిపోయారు. నివాళులర్పించి, హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.జగన్ వెంట ఆయన సతీమణి భారతి, కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు,వైఎస్ అభిమానులు ఉన్నారు.
