తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, సీనియర్ నాయకుడు తోట త్రిమూర్తులు మరో సంచనల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంనుంచే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్నా ఆయన జనసేన, వైసీపీలో ఎటుచేరాలనేదానిపై చర్చిస్తున్నారని వార్తలొచ్చాయి. వైసీపీ వైపే తోట మొగ్గు చూపినా సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకుని తోట జనసేన వైపు వెళ్లాలని కొందరు కోరారు. అయినా తోట వైసీపీవైపే కదిలారు. ఇప్పటికే ఆయన పార్టీలో చేరాల్సి ఉన్నా పలు కారణాలతో ఆయన చేరిక వాయిదా పడింది. అయితే ఇటీవల వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్‌లతో తోట చర్చలు జరిపారు.. అప్పడే ఆయన పార్టీ మారాలి.
జిల్లాలో బలమైన నేతగా పేరున్న తోట ఇప్పుడు ఎన్నికలు మరి కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారట. తాజాగా ఆయన బంధువు అయిన టీడీపీ ఎంపీ తోట నరసింహం వైసీపీలో చేరడంతో త్రిమూర్తులుపు అనుచరులు, అభిమానులు భారీగా ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకాలం అధికార టీడీపీలో ఉన్నా నియోజకవర్గానికి ఆశించిన స్థాయిలో ఏమీ చేయలేకపోవడం, ఇప్పుడు ఓడిపోతున్న టీడీపీలో ఉన్న ఉపయోగం ఉండదని జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తోట వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్టు స్పష్టమవుతోంది. అలాగే తోట చేరికతో జిల్లావ్యాప్తంగా వైసీపీకి కూడా లాభిస్తుందని ఆపార్టీ అభిప్రాయపడుతోంది.