ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ మరోసారి తన ప్రసంగంలో నోరుజారాడు.మంగళగిరి నుండి టికెట్ ఆశించిన ఆ పార్టీ నాయకుడు గంజి చిరంజీవిని బుజ్జగించడానికి వచ్చిన లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ మరోసారి తడపడ్డాడు.మంగళగిరిలో మన పార్టీ టీడీపీ 1980వ సంవత్సరం నుంచి ఇక్కడ గెలవలేదని,మరి ఇక్కడ నేను గెలవాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.వాస్తవానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించారు,కాని లోకేష్ మాత్రం 1980 నుండి మంగళగిరిలో టీడీపీ ఓడిపోతుందని చెప్పగా,పార్టీ నాయకులు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు.ఇలాంటి మాటలు వల్ల ఈ సమయంలో పార్టీకి చాల నష్టమని అందరూ అభిప్రాయపడినా లోకేష్ కి చెప్పలేని పరిస్థితి.ఇది ఇలా ఉండగా చంద్రబాబు మంగళగిరి సీటు లోకేష్ కి కట్టబెట్టారు.దీంతో ఎప్పటినుండో ఆ టికెట్ పై ఆశలు పెట్టుకున్న నేతలకు షాక్ తగిలింది.ఈ మేరకు వీరందరూ పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారనే సమాచారం రావడంతో వాళ్ళని బుజ్జగించేందుకు లోకేష్ నిన్న రాత్రి మంగళగిరి చేరుకున్నారు.టీడీపీ నాయకుడు గంజి చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ..నేను ఎవరిని బుజ్జగించడానికి రాలేదని..పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఇక్కడ పోటీ చేస్తున్నానని తెలిపారు.
ఇది ఇలా ఉండగా ఒక పక్క పద్మశాలీయులకు మరోపక్క బీసీ సంఘాలు టికెట్ ఇవ్వకుండా మోసం చేసారని ఆందోళన దిగారు.తమ సామాజికి వర్గానికి రాష్ట్రంలో ఎక్కడా సీటు కేటాయించకపోవడంతో మంగళగిరి పట్టణానికి చెందిన పద్మశాలీలు శుక్రవారం తమ వ్యాపార సముదాయాల బంద్కు పిలుపునిచ్చారు. ఇక బీసీలు అయితే మంగళగిరిలో తమ వర్గానికే సీటు ఇస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారని అన్నారు.