Home / 18+ / పశ్చిమలో కీలక వికెట్ ఔట్.. దిక్కుతోచని స్థితిలో జిల్లా జనసైనికులు

పశ్చిమలో కీలక వికెట్ ఔట్.. దిక్కుతోచని స్థితిలో జిల్లా జనసైనికులు

జనసేన పార్టీలో ముసలం మొదలైంది. పశ్చిమ గోదావరి జల్లా జనసేన కో-కన్వీనర్ యర్రా నవీన్ గురువారం పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కనీసం తనను మాటమాత్రమైనా సంప్రదించకుండా తాడేపల్లిగూడెం అభ్యర్థిని ప్రకటించారన్న మనస్తాపంతో నవీన్ చేసినట్టు ఆయన వెల్లడించారు. అలాగే ఆయన ఉండి నియోజకవర్గ సీటు ఆశించినా ఆయనకు సీటు ఇవ్వకపోవడంతోపాటు పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారని కానీ అలా జరగలేదని వాపోయారు. పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఇతర పార్టీల్లో టికెట్ ఇవ్వనివారికి టికెట్ ఇవ్వడం సమంజసం కాదని నవీన్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌ కనీసం జనసేన కార్యాలయంలో అప్లికేషన్ పెట్టలేదని వెల్లడించారు.

దరఖాస్తులు చాలా వచ్చాయని చెప్పుకోవడం కాదని, అప్లికేషన్ పెట్టిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తనకు టిక్కెట్‌ ఇవ్వకపోయినా కష్టపడిన వారికి ఇచ్చి ఉంటే చాలా సంతోషించేవాడినన్నారు. పవన్ సిద్ధాంతాలు నచ్చే పార్టలో చేరానని, కానీ స్వార్ధ రాజకీయాలు చేయడం నచ్చలేదని నవీన్ వాపోయారు. తన రాజీనామాతో మళ్లీ ఇటువంటి పొరపాటు జరగకుండా చూస్తారనే రాజీనామా చేస్తున్నానన్నారు. అయితే జిల్లాలో కీలకనేతగా పనిచేసిన నవీన్ రాజీనామా చేయడంతో ఇప్పటివరకూ ఆయనవెంట నడిచిన అభిమానులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కనీసం పార్టీ తరపున ఎవరూ పట్టించుకోకపోవడంతో జనసేన ప్రజారాజ్యంలా తయారైందని జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat