అధికార టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీపై సొంతపార్టీ నేతలు తిరుగుబాటు చేసారు. సూరీ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. అంతేకాదు ఆయన మాట్లాడిన ఆడియో టేపులు విడుదల చేసి సూరి బండారాన్ని బట్టబయలు చేశారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనకు తిరుగుండదు. ఎన్నికల్లో బాగా పనిచేయండి. కౌంటింగ్ పూర్తైన క్షణం నుంచి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు మొదలుపెడదాం. నరుకుదాం.. చంపుదాం.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులకు ముందే చెబుదాం. ఆరు నెలల్లో ప్రత్యర్థులను అంతమొందిద్దామంటూ కార్యకర్తలతో మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో టేపులతో ప్రస్తుతం కలకలం రేగుతోంది.
ఈ నేపథ్యంలో ధర్మవరం టీడీపీ నేతలు మాట్లాడుతూ.. సూరీ నియంతలా వ్యవహరిస్తున్నారు. శ్రమించే కార్యకర్తలకు న్యాయం చేయలేదు. డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేశారు. సూరీ నాయకత్వంలో పనిచేయలేమని అసమ్మతి వెళ్లగక్కారు. ఈయన గతంలో కూడా బలవంతపు భూసేకరణను అడ్డుకున్న మహిళారైతుపై ఆయన నోరు పారేసుకున్నారు. మహిళా రైతును చెప్పుతో కొట్టాలని అనుచరుడికి హుకుం జారీ చేసిన సూరీ దాడిచేసాక కేసు నమోదు చేయొద్దని ఎస్సైకు ఆదేశాలు చేశారు కూడా ప్రస్తుతం చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే హత్యలు స్టార్ట్ చేద్దామనే ఆడియో టేపుతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయ విధానాలు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.