మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి.గత కొన్ని రోజుల నుంచి చూస్తే ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ),ఎంపీ తోట నరసింహం, ఆయన సతీమణి వాణి,గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి చేరారు.తాజాగా ఇవాళ ప్రముఖ నటుడు దాసరి అరుణ్ కుమార్ వైసీపీలో చేరారు. ఇక రేపు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ , ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. మాగుంట తన ఎమ్మెల్సీ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ తన రాజీనామా లేఖను పార్టీ అధినేత నారా చంద్రబాబు, కళా వెంకటరావుకు పంపించారు. కాగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ,కొణతాల రామకృష్ణ వైసీపీలో వైసీపీలో చేరతారు అని పోయిన నెలలోనే చెప్పింది దరువు.కామ్
