తెలుగుదేశం పార్టీకి సిటింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.సుబ్బారావు గత ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికై, ఆ తర్వాత టీడీపీలో చేరారు.తెలుగుదేశంలో తనకు అన్యాయం జరిగిందని, ఆయన కార్యకర్తల సమావేశంలో కంటతడిపెట్టారు.తెలుగుదేశం పార్టీలో ప్రాదాన్యత లేకుండా పోయిందని ఆయన అన్నారు.కాగా కార్యకర్తలు ఆయనను వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి చేయడం విశేషం.దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ లు ఇచ్చిన మాట మీద నిలబడేవారని కూడా సుబ్బారావు అన్నారు.వారిద్దరి హాయాంలలోనే తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని చెప్పుకొచ్చారు.ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ కూడా టీడీపీకి గుడ్ బై చెప్పిరు.