ఏపీలో ప్రధాన ప్రతి పక్షమైన వైసీపీ పార్టీలో వలసల జోరు భారీగా కొనసాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఇంకా ఆగని వలసల పర్వం. గత కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి, ఎంపీ పదవికి తోట నరసింహం రాజీనామా చేశారు. తోట నరసింహం దంపతులు రేపు వైసీపీలో చేరనున్నారు. పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుండి నరసింహం సతీమణి వాణీని వైసీపీ తరుపున బరిలో దించుతున్నారు .అనారోగ్య రీత్యా తోట నరసింహం పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది.
