వైసీపీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్ధుల తొలి జాబితా సిద్ధమవుతోంది.. మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకుగాను ఇవాళ తొలి విడతలో సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించనున్నారు పార్టీ అధినేత జగన్. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో పార్టీలు అభ్యర్థుల ఎంపికను త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే మెజారిటీ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు కొలిక్కి వచ్చింది. తొలి జాబితాలో సుమారు 100మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అధికారానికి దగ్గరవుతున్నామనే ఆనందంలో వైసీపీ అభ్యర్థుల ఎంపికలో ఎన్నో అంశాలను పరిశీలిస్తోంది. భారీ చేరికలతో జోష్ కొనసాగిస్తోంది వైసీపీ.. సీనియర్ నాయకులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, తోట నర్సింహం, ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ తో పాటుగా విజయవాడ మాజీ మేయర్, ప్రముఖ నటుడు చిరంజీవి బంధువైన రత్నబిందు, ఏలూరు మేయర్ నూర్జహాన్, ఆమెభర్త ప్రముఖ రియల్టర్ పెదబాబు వైసీపీలో చేరారు. పార్టీ అధినేత జగన్ కండువాలు కప్పి ఆహ్వానించారు.