తాజాగా వైసీపీలో చేరిన నటుడు అలీ ప్రచారం మొదలు పెట్టేసారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో జగన్ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. జగన్ దూరదృష్టితో బడుగు బలహీన వర్గాలను అభివృద్థి చేస్తారన్నారు. రాష్ట్రాన్ని జగన్ చేతుల్లో పెడితే యువత భవిష్యత్తు సంతోషకరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు ముస్లిం మైనారిటీలను ఓటుబ్యాంకుగా భావించారే తప్ప వారి స్థితిగతులను మెరుగు పరిచేందుకు కృషి చేయలేదన్నారు.
పార్టీలో సామాన్య కార్యకర్తగా జగన్ నాకు అప్పగించిన పని నిర్వర్తిసానన్నారు. తాను 1999 నుంచి చంద్రబాబు కోసం ప్రచారం చేసి చంద్రబాబుకు అధికారం దక్కేలా చేశానన్నారు. 2019లో జగన్ తరఫున ప్రచారం చేసి ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు కృషిచేస్తాన్నారు. తనను చాలామంది తమ పార్టీల్లో చేరమని ఆహ్వానించారని, తాను మైనారిటీని అలీ వచ్చేస్తే వారంతా తమ వైపు మొగ్గు చూపుతారనే స్వార్థంతోనే పిలిచారన్నారు. కానీ ఎవరో చెబితే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోలేదని పూర్తి ఇష్టంతోనే వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు.