ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకావడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరతునున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే భారీగా నేతలందరు వైసీపీలో చేరుతున్నప్పటికి ఇంకా వైసీపీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అత్యంత విశ్వసనియ సమచారం. నిన్న చంద్రబాబు ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తోట త్రిమూర్తులు గారికి రామచంద్రాపురం సీటు కన్ఫర్మ్ చేశారు. అయినా కూడా తెలుగుదేశం గెలవదని స్పష్టమైన సమాచారం ఉండటంతో వైసీపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతంది. అంతేకాదు చంద్రబాబు బోర్డు పెట్టుకోవాలి ‘టీడీపీకి అభ్యర్థులు కావలెను.. రండమ్మ రండి’అని కామెంట్లతో వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
