ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 24 గంటల్లోనే టీడీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఏపీలో ప్రధాన ప్రతి పక్షమైన వైసీపీ పార్టీలో వలసల జోరు కొనసాగుతోంది. కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయం శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. మరో రెండురోజుల్లో వైసీపీలో చేరనున్న కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం కుటుంబం. ఈరోజు జగన్ తో కాకినాడలో నేరుగా చర్చలు జరపనున్నట్లు సమచారం. కాకినాడ సిటీ, పెద్దాపురం అసెంబ్లీ స్థానాల్లో ఏదొక స్థానం నుండి నరసింహం సతీమణి వాణీని వైసీపీ తరుపున బరిలో దించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో విజయవాడలో జరగనున్న భారీ బహిరంగ సభలో వైసీపీ కండువా కప్పుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.