ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకావడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు. సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదారంగా ఆహ్వానించారు. శివరామ సుబ్రహ్మణ్యంతో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు.
