Home / ANDHRAPRADESH / వైసీపీలోకి మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్, రెండో పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్న సీనియర్ నేత

వైసీపీలోకి మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్, రెండో పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్న సీనియర్ నేత

ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార‌మే ల‌క్ష్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాడోపేడో తేల్చుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. త‌న‌దైన వ్యూహాల‌తో జగన్ దూసుకుపోతున్నారు. ఏడాదికి పైగా పాద‌యాత్ర చేసిన వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌తో వైసీపీ మైలేజ్ అమాంతం పెంచేశారు జ‌గ‌న్. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి తిరుగులేద‌ని అన్ని స‌ర్వేలు కూడా చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో క్యూకట్టి మరీ వైసీపీలోకి ఇతర పార్టీల నేతలు చేరుతున్నారు. కొద్ది రోజుల్లో మ‌రికొంత‌మంది సీనియ‌ర్ నేత‌లు వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నార‌ని స‌మాచారం. వారిలో ముఖ్యంగా సీనియర్ నేత వ‌ట్టివ‌సంత కుమార్ పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి దశాబ్ధాలుగా సేవ‌లందించిన వ‌ట్టి తాజాగా కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై తీవ్ర‌మ‌న‌స్తాపం చెందారు. ఇప్పటికే ఆయ‌న కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. అప్పటినుంచీ ఆయన స్తబ్ధుగా ఉండిపోయారు. ఆయనను ఇప్పటికే వైసీపీలోకి ఆహ్వానించారని టాక్. కావాల్సిన స్థానంలో టిక్కెట్ ఇస్తామ‌ని, పార్టీలో స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని వైసీపీ సీనియర్ నాయకులు హామీ కూడా ఇచ్చార‌ట జ‌గ‌న్. గతంలో 3న ఎం.ఎం.పురంలో తన స‌న్నిహితుల‌తో భేటి అయిన వట్టిని అనుచరులు, అభిమానులంతా వైసీపీలో చేరే నిర్ణ‌యం తీసుకోమన్నార‌ని స‌మాచారం. దీంతో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే, వ‌ట్టి వ‌సంత్ వైసీపీలోకి రానున్నారని దాదాపుగా ఖరారైంది. పశ్చిమగోదావరి జిల్లాలోనే సీనియర్ లీడర్ వట్టి వసంతకుమార్ పేరుగాంచారు. ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన ఈయన మరికొన్నిరోజుల్లో వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారట. మారిన పరిస్థితుల నేపథ్యంలో వైసీపీతోనే తన సెకండ్ పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat