కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం 5 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సాయంత్రం జరిగే ఈ ప్రెస్మీట్లో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు, ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేరోజు జరగనున్నట్టు సమాచారం. మొత్తం తొమ్మిది లేదా పది విడతల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.
