కర్నూలు జిల్లాలో వైయస్ఆర్‌సీపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. దాదాపుగా కడప తర్వాత కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి వీస్తోంది. 14 నియోజకవర్గాల్లో వైసీపీ తిరుగులేని న్యాయకత్వంతో ముందుకెళ్తుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర సివిల్ సప్లై సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మరీ చెల్లా రామకృష్ణారెడ్డి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా ఇదే జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పోచా బ్రహ్మానందరెడ్డి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు వైయస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్‌రెడ్డి, గంగుల నాని తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మనందరెడ్డి చేరికతో జిల్లాలో పార్టీకి మరింత బలోపేతం అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని ఈ నేపధ్యంలో వైఎస్సార్సీపీకి గతంలోకంటే స్పష్టమైన ఆధిక్యత మెజార్టీ వస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ దెబ్బతో జిల్లాలో డిపాజిట్లు కోల్పోయే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని వైసీపీ సీనియర్ నేతలు వెల్లడిస్తున్నారు.
