మరోసారి శనివారం పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాన్ గాయపడిన ఘటన పూంచ్ జిల్లాలో వెలుగుచూసింది. పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.. ఇది కొత్తేమీ కాదు.. శనివారం ఉదయం పాకిస్థాన్ సైనికులు జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లోని పూంచ్ జిల్లాలోని షాపూర్, కెర్నీ సెక్టార్లలో కాల్పులకు తెగబడ్డారు. పాక్ సైనికులు జరిపిన కాల్పులను భారత సైనికులు సమర్ధంగా తిప్పి కొట్టారు. ఈ ఘటనలో ఓ భారత జవానుకు తీవ్రంగా గాయాలయ్యాయని సమాచారం.. గాయపడిన పోలీసు అధికారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. దీంతో కోపోద్రిక్తులైన భారత సైనికులు కూడా తీవ్రంగా ప్రతిఘటించడంతో పాక్ సైనికులు తోక ముడిచారు.
