స్త్రీలందరికీ తమ తోటిస్త్రీకి జరిగిన అన్యాయాన్ని చూపించడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్ధేశ్యం అంటున్నాడు ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ చిత్రానికి సంబంధించిన ప్‌తమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేశాడు. ఇప్పటికే ఓ ట్రైలర్ విడుదల చేసి సంచలనాలు సృష్టించిన వర్మ తాజాగా మరో ట్రైలర్ విడుదల చేశారు. వాడు నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు అనే క్యాప్షన్‌తో ట్రైలర్ మొదలై లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు దూషించడం, పార్టీని తమ చేతిలోకి లాక్కునేందుకు చంద్రబాబు ప్రణాళికలు వేయడం వంటి అంశాలని ట్రైలర్లో చూపించారు. యజ్ఞాశెట్టి ‘లక్ష్మీపార్వతి’ పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రంగస్థల కళాకారుడు పీ విజయ్ కుమార్ నటిస్తున్నారు.
ఇక చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు. చిత్ర టైటిల్ నుండి మొదలు కొని ట్రైలర్, సినిమా ఫొటోలు, సాంగ్స్ వరకు అంత రచ్చ రచ్చ చేస్తున్నాయి. సినిమాకు సంబంధించిన ట్రైలర్ మార్చి 08వ తేదీ శుక్రవారం రిలీజ్ చేశారు. ‘మీరనుకున్నట్లు ఆమె మంచి మనిషి కాదు..ఇంతకు ముందే ఆవిడతో ఎఫైర్స్ ఉన్నాయి’ అని చంద్రబాబు పాత్రలో ఉన్న వ్యక్తి మాట్లాడడం, ‘జయసుధ, జయప్రద ఎందరో మహామహా నటీమణులను పంచుకున్న ఆయనకు దానిలో ఏముందో’నని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అనడం’ ఆయన ఉన్నంతవరకూ ఏ హానీ తలపెట్టనని హామీనివ్వండి’ అని ఫోన్లో లక్ష్మీ పార్వతి కోరడం ‘నా కొడుకు లోకేష్ మీద ఒట్టేసి చెబుతున్నా’ అంటూ చంద్రబాబు మాట్లాడడం వంటివి సంచలనం రేకెత్తిస్తున్నాయి.
ఈ ట్రైలర్ కు యూ ట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే కొన్ని లక్షల వ్యూస్ రావడం విశేషం. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశం దగ్గరి నుండి చివరి వరకు జరిగిన పరిణామాల్లో బాబు పాత్ర ఏమిటన్నది వర్మ చూపించే ప్రయత్నం చేశారని అదే అర్థమౌతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. సినిమాను అడ్డుకుంటారనే వార్తలూ వినిపిస్తున్నాయి. అయితే నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు, ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం అని వర్మ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తుండగా, మార్చి 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.