తెలంగాణ రాష్ట్ర వైద్యా సేవలు మౌళిక సదుపాయాల కల్పన సంస్థల చైర్మెన్ పదవికి మరో ఏడాది కాలం పొడిగించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.ఇదివరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరియడా క్రిష్ణ మూర్తిని ఈ పదవిలో నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తన పదవి కాలనీ మరో ఏడాది పాటు పొడిగించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి మరియు సీఎం కేసీఆర్ కు ఛైర్మెన్ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అస్సోసిషన్ అధ్యక్షులు జూపల్లి రాజేందర్ మెుఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పరియడా క్రిష్ణ మూర్తి విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన పైన ఉంచిన నమ్మకని వమ్ము చేయనని మరియు డిపార్ట్మెంట్ కి మంచి పేరు వచ్చేవిధంగా సిబ్బంది తో కలసి ముందుకు సాగుతానని తెలిపారు.