పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టబోయింది. కారు డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో ఎమ్మెల్యే ఊపిరిపీల్చుకున్నారు. ఉయ్యూరు మండలం ఓగిరాలలో వివాహానికి వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. ప్రమాద వివరాలను టీడీపీ నేతలు ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక నేతలు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రసాద్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నట్లు తెలుస్తోంది.