ఏపీ ప్రజల డేటాచోరి చేసిన కేసులో సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ తీరుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికాలో పర్స్ పోతే హైదరాబాదులో కేసేమిటో అర్థంకాక బుర్ర గోక్కుంటున్న చిట్టి నాయుడికి బైధ్యనాథ్ చ్యవన్ ప్రాశ్ డోస్ పెంచండి చంద్రం సార్ అంటూ ఎద్దేవాచేశారు. లోకేశ్ కు శంకుపుష్పి కూడా తినిపించాలని, లేకపోతే 8th ‘స్టాండర్డు లో ఫెయిలవుతాడని, ఇలా అయితే కొన్నాళ్లకు లోకేశ్ దేవాన్ష్ క్లాస్మేట్ అవుతాడన్నారు. టీడీపీ అధికారానికి ఆఖరి ఘడియలు వచ్చాయని చంద్రబాబుకు అర్థమైందని, పవర్ లేకుండా బతకలేని మీలాంటి వ్యక్తులు చివరిగా దేనికైనా తెగిస్తారన్నారు. ఇటువంటి రుగ్మతను సైకాలజీలో Fear of Rejection గా పిలుస్తారని, చంద్రబాబు ఇంత పొరపాటు ఎలా చేశాడో అర్థంకాక విపరీత భావోద్వేగాలు కనబరుస్తున్నాడని ఆయనన్నారు.
