నారా లోకేశ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు 2014 ఎన్నికల్లో సైతం పోటీ చేయలేదు. అయితే 2017లో లోకేశ్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన చంద్రబాబు.. ఆ తర్వాత తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. దొడ్డిదారిన మంత్రి అయ్యారంటూ లోకేశ్ ను విమర్శించని వ్యక్తి రాష్ట్రంలో లేరనేది వాస్తవం అయితే ఇప్పుడు లోకేశ్ కోసం సురక్షిత స్థానాన్ని వెతికే పనిలో టీడీపీ శ్రేణులు పడ్డాయి. తొలిసారి మంత్రి అయిన లోకేశ్ ఇప్పుడు తొలిసారి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లోకేశ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు.. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఈలి నాని పేరును చంద్రబాబు ఖరారు చేశారు. కుల సమీకరణాల కారణంగా ఈలి నాని వైపే మొగ్గు చూపారు. ఈ స్థానం ఆశించిన బాపిరాజును చంద్రబాబు బుజ్జగించారు. సమీకరణాల వల్ల టిక్కెట్ ఇవ్వలేకపోయానని బాపిరాజుకు ఆయన తెలిపారు. అలాగే అర్థరాత్రివరకు విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్ష జరిపారు. అనకాపల్లి, చోడవరం సెగ్మెంట్లలో సిట్టింగ్‌లతో పాటు కొత్తవారి పేర్లు పరిశీలించారు. మంత్రి గంటా ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో లోకేష్ పేరు పరిశీలించినట్టు తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావుకు విశాఖ ఉత్తర సీటు కేటాయించినట్టు తెలుస్తోంది.
