మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు.వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు మరియు ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా మరియు పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది. కొన్ని ప్రాంతాలలో, ఈ దినానికి రాజకీయ రంగు పోయి, పురుషులు స్త్రీలకు గల ప్రేమను వ్యక్తపరిచే విధంగా అనగా మాతృమూర్తుల దినోత్సవం మరియు వాలెంటీన్స్ దినోత్సవం లాగా మారిపోయింది. ఇంకొన్ని ప్రాంతాలలో, ఐక్యరాజ్యసమితి ఉద్దేశించినవిధంగా రాజకీయ మరియు మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ మరియు సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచేవిధంగా జరుపుతారు.
