సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన ముఖ్యనేతలు వైసీపీలో చేరారు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, జయసుద, జైరమేష్ లు వైసీపీ చేరారు. తాజాగా టీడీపీకి చెందిన కొందరు మాజీ ఎంపీలు, ఆ పార్టీ కీలక నేతలు వైసీపీలో చేరేందుకు సిద్దమయినట్టు తెలుస్తోంది. అలాగే జై రమేష్ సోదరుడు దాసరి బాలవర్ధన్ రావు గతంలో గన్నవరం శాసనసభ్యుడిగా పనిచేశారు. ఆయన కూడా వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా గన్నవరంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బాలవర్ధన్ రావు కూడా తన అన్న జై రమేష్ ఎటు పయనిస్తే అటు ఉంటానని చెప్పారు. టీడీపీ కోసం తమ ఆస్తులు దారబోశామని.. కానీ తమ శ్రమను గుర్తించడంలో అధినాయకత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ క్రమంలో ఆయన తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్పీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
