2019 సంవత్సరంకు గాను ఇప్పటివరకు రిలీజ్ ఐన అన్ని సినిమాల్లోకి ఒక్క ఎఫ్ 2 మాత్రమే హిట్ కొట్టింది.సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం విన్నర్‌గా నిలిచింది. వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా,తమన్నా మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించిన సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఓవరాల్‌గా 140 కోట్లు సాధించిందని యూనిట్ అధికారంగా చెప్పారు.
అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు తొలిగించిన కొన్ని సీన్లను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి ప్రేక్షకుల ముందు పెట్టారు.ఈ వీడియోలో వెంకీ, మెహ్రీన్ మధ్య నడిచే ఓ సన్నివేశం హైలైట్ అంటున్నారు.ఈ సీన్ నిజంగా సినిమాలో పెట్టి ఉంటే థియేటర్ లో జనాలు నవ్వుతూనే ఉంటారు.ఈ చిత్రం హిట్ కావడంతో దీనికి సీక్వెల్‌ను ప్రకటించాడు డైరెక్టర్ అనిల్.ఈ మేరకు కథ సిద్ధం చేస్తున్నారట.