భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తనెంత సింపుల్‌గా ఉంటాడో చూపించాడు.ధోనీ హోం గ్రౌండ్ ఐన రాంచి స్టేడియంలో పెవిలియన్‌ను తన పేరు పెట్టారు.అయితే ఆ పెవిలియన్‌ను ఆవిష్కరించడానికి ధోనీ నిరాకరించాడు.ఇప్పటివరకు ముంబయి వాంఖడే స్టేడియంలో సునిల్ గావస్కర్ స్టాండ్,ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో వీరేంద్ర సెహ్వాగ్ గేట్ ఉన్న విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఝార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘ ఓ స్టాండ్‌కు ‘మహేంద్ర సింగ్ ధోనీ పెవిలియన్’ అని పేరు పెట్టారు.
ఈమేరకు దీని ఓపెనింగ్ కు మిస్టర్ కూల్ ని పిలవగా ఆయన నిరాకరించారు.ఈ విషయంపై జీఎస్‌సీఏ కార్యదర్శి దేవాశీశ్ చక్రవర్తి మాట్లాడుతూ మీడియా, వీఐపీ బాక్స్‌లు ఉన్న నార్త్‌స్టాండ్‌కు ధోనీ పేరు పెట్టాలని గతేడాది నిర్ణయించుకున్నాం,ఇందుకుగాను ఆయనను ప్రారంభించాలని కోరాం..అందుకు ధోనీ ఇది నా సొంతం ఇల్లులాంటిది ఇందులో నేను చేయడానికి ఏముంటుందని హుందాగా అడిగారు.