మరి కొద్దిరోజుల్లో ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంతో అధికార టీడీపీకి భారీ షాక్ లు తగులుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి న్యాయకత్వం కూడా టీడపీని వీడుతున్నారు. కీలకమైన ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలను చేరికలు కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా వైయస్ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరగా నగర టీడీపీ అధ్యక్షుడు సాధిక్ అలీ కూడా టీడీపీకి రాజీనామా చేపి జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. ఆయనకు పార్టీ అధినేత వైయస్ జగన్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్ అనుచరులు, టీడీపీ సీనియర్ నాయకులు కూడా టీడీపీని వీడారు. ముఖ్య నాయకుడు సతీష్ అనుచరులు జేరిపిటి సుధాకర్‌తో సహా 30 కుటుంబాలు టీడీపీని వీడి వీసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు.