వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్క్వాష్ రాకెట్స్ సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మంగళవారం నాడు నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు కోసం ఎంపీగా రాజ్యసభలో తన వాణిని వినిపించే విజయసాయి రెడ్డి స్పోర్ట్స్ రంగంలోకి రావడం ఆనందంగా ఉందని, రాష్ట్ర క్రీడా రంగాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకొని ముందుకు నడిపించాలని ఎంపీ విజయసాయి రెడ్డి ని సభ్యులు కోరారు.
