ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన ఓటుకు కోట్లు కేసులో మరో సంచలన కోణం వెలుగుచూసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు అప్పటి తన పార్టీనేత రేవంత్‌రెడ్డిని డబ్బుతో పంపిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో రేటు ఫిక్స్ చేసే అంశంపై మరో వీడియో తాజాగా బయటపడింది. ఈమేరకు ఓజాతీయ మీడియా ఈ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంతో మళ్లీ ఓటుకుకోట్లు చర్చనీయాంశంగా మారింది. తాజాగా బయటకొచ్చిన ఈ వీడియోలో ఏముందంటే టీడీపీనేత సెబాస్టియన్ స్టీఫెన్సన్ ల మధ్య రేటు విషయంలో ఒప్పందం గురించి చర్చించిన విషయాలు వెలుగుచూశాయి.
టీడీపీ తరఫున నిలబడిన ఎమ్మెల్సీకి ఓటువేస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిఫెన్‌సన్‌కు రూ.3.50 కోట్లు ఇస్తామని ఒప్పుకున్నారని సెబాస్టియన్ చెబుతుండగా ఆరేటు తన ప్రమేయంతో రూ.5 కోట్లకు పెంచుతున్నానని ముందు డీల్ ఫినీష్ చేయమని చంద్రబాబు చెప్పినట్లు వీడియో సంభాషణల్లో స్పష్టంగా వినిపిస్తోంది. 11.30 నిమిషాల నిడివి గల ఈవీడియో ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎమ్మెల్యేను కొనుగోలు చేసే అంశాలు బయటకురావడంతో తెలుగు ప్రజలు చంద్రబాబు తీరును మరోసారి తీవ్రంగా తప్పుబడుతున్నారు