వైఎస్సార్సీపీ విజయం దాదాపుగా ఖాయమవుతోంది.. వైసీపీ అథినేత పాదయాత్ర ద్వారా ఇచ్చిన హామీల పట్ల ప్రజల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది. జగన్ కు ప్రజలు పట్టం కట్టనున్నారని ఇప్పటికే పదుల సంఖ్యలో సర్వేల్లో తేలింది. అయితే ఇదే జరిగితే చంద్రబాబు ఏమైపోతారోనని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయంగా బలమైన నాయకులు అధికారంలో ఉన్న తన పార్టీని వీడడాన్ని చంద్రబాబు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.. ఓటమి ఖాయమన్న చేదు నిజాన్ని తట్టుకోలేక మతిస్థిమితం కోల్పోయినట్టుగా పూర్తిగా పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నారు. చాలాసార్లు అసలు తానేం మాట్లాడుతున్నాడో తనకే తెలీకుండా బాబుకు పిచ్చిమాటలు వస్తున్నాయని స్పష్టంగా అర్ధమవుతోంది.
అలాగే పవన్ కళ్యాణ్ దీ అదే పరిస్థితట.. ఇప్పటివరకూ తానే టీడీపీని గెలిపించానన్న విజయగర్వంతో ఉన్న పవన్ ఏంచేసినా ఈ ఐదేళ్లు చెల్లింది. అలాగే తాను మాట్లాడే అర్థంపర్ధంలేని పిచ్చి మాటలను కూడా ప్రజలు, పవన్ అభిమానులు భరిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేగంగా మారిపోయింది. చంద్రబాబు చెప్పినట్టు చేస్తూ విడిగా ఎన్నికలకు వెళుతున్నా తాను ఎట్టిపరిస్థితుల్లో కింగ్ మేకర్ కాలేనన్న నిజం పవన్ ను తీవ్ర డిప్రెషన్ లో పడేస్తోంది. ఈ ఎన్నికల్లో వచ్చే సీట్లవల్ల పవన్ కులబలం అనే గాలిబుడగ కూడా పేలిపోతుందనే పవన్ టెన్షన్. పూర్తిగా పరువు పోగొట్టుకుని బకారా అవుతానేమోనన్న భయం వెంటాడుతున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు తరహాలోనే పవన్ కళ్యాణ్ కు కూడా పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి.