టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు మహర్షి తర్వాత సుకుమార్ తో సినిమా చెయ్యాలి.వీరిద్దరి కాంబినేషన్ ఐతే సినిమా హిట్ అవ్తుందని అందరూ భావిస్తున్న సమయంలో మహేష్ బాబు సుకుమార్ ప్రాజెక్ట్ కాన్సిల్ అని ప్రకటించారు.ఇది ప్రకటించిన ముందురోజే అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్ కు ప్రకటన జరిగింది.దీంతో టాలీవుడ్ అంతా చర్చనీయాంశంగా మారింది.
సుకుమార్ రంగస్థలం చిత్రం తరువాత మైత్రి మూవీస్ నిర్మాణంలో సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ లో చిత్రానికి ప్రకటన జరిగింది.అయితే ఇప్పటికీ సుకుమార్ ఇంకా కధ రెడీ చెయ్యలేదంట.దీంతో కాస్త ఆలస్యం అవుతుందని అందరూ అనుకున్నారు.ఇది ఇలా ఉండగా శివరాత్రి నాడు సడన్ గా ఒక ప్రకటన వెలువడింది.అదే అల్లు అర్జున్, సుకుమార్ కొత్త చిత్రం.వెనువెంటనే మహేష్ సుకుమార్ దర్శత్వంలో నటించడం లేదని, అతడి కొత్త చిత్రానికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేసేశాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ ఎపిసోడ్ ఎన్నో అనుమానిత కారణాలకి దారితీస్తుంది..సుకుమార్ కధలు మహేష్ కి నచ్చవని,ఒకవేళ చిత్రం ఓకే అయితే షూటింగ్ త్వరగా పూర్తి చెయ్యాలని కండిషన్ పెడతారంట.అందుకనే సుకుమార్ మరియు నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.దీనిపై మరో అనుమానం కూడా ఉంది. బన్నీ కాంబినేషన్ మూడవసారి సెట్ కావడం వెనుక అల్లు అరవింద్ హస్తం ఉందని తెలుస్తుంది.ఆయన వత్తిడే దీనికి కారణం అని అనుకుంటున్నారు.